రక్షా బంధన్ విశిష్టత - రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు?
రాఖి పౌర్ణమి లేదా రక్షా బంధన్ పండుగ బ్రదర్స్ ఆండ్ సిస్టర్స్ ప్రేమానురాగాలు ప్రతీకగా నిలిచే పండుగ. రాఖీ అనగా రక్షణ బంధం. తన అన్నయ్య ఉన్నత శిఖరాలకు ఎదగాలని భావించే గొప్ప పండుగ ఈ రాఖీ పండుగ.
రాఖీ పండుగ పూర్వం దేవతల కాలం నుండే ప్రసిధి లో వుంది. పూర్వం దేవతలకు రాక్షసు కు యుద్ధం జరిగినప్పుడు దేవతల రాజైన దేవేంద్రుడు నిర్వీర్యుడై తన సైనాయన్ని అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. ఆలా వున్నా తన భర్తను చూసి ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. సరిగ్గా శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి దేవేంద్రుడు చేతికి రక్షా కడుతుంది ఇది గమనించిన దేవతలు దేవేంద్రుడు కు రక్షా కడతారు . ఆవిదంగ దేవేంద్రుడు రాక్షసుల మీద యుద్ధం గెలిచి తిరిగి వస్తాడు . ఎలా రాఖీ పొర్ణమి మొదలయ్యింది......
ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం : పురాణాల ప్రాకారం ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం గొప్ప అన్న చెల్లెలు గా ప్రసిద్ధి . శిశుపాలుడి ని శిక్షించే సమయం లో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమణినిచ్చిన ద్రౌపది తన చీరను చించి కృష్ణుని వేలుకి కడుతుంది అంట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు...
అలెగ్జాండర్ భార్య – పురుషోత్తముడి కథ
గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమం లో నేటి నేటి ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహబంధాన్ని ఉపయోగించి మధ్య ఆసియా దేశాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అదేవిదం గా అలెగ్జాండర్ భారతదేశం పై యుద్ధం ప్రకటిస్తారు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు.అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త ఐన అలెగ్జాండర్ చంపవద్దు అని కోరుతుంది. పురుషోత్తముడు రోక్సానా ను తన సోదరిగా భావించి యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ ను చంపకుండా విడిచి పెడతాడు...
అలా చాల కథలు రక్షా బంధన్ గురించి వున్నాయి. అన్న చెలెల్లు ఈ రాఖీ పండుగని చాల పవిత్రం గా దేశమంతా జరుపుకుంటారు.
0 Comments