అనగనగ ఒకవూరిలో మంచి నీటి సరస్సు ఉండేది . అందులో చాల చేపలు నివసించేవి . అందులో మూడు చాపలు మైత్రిమీన, జ్ఞానమీన మరియు సోమరీన చాల స్నేహముగా ఉండేవి . ఈ చేపలు సరస్సులో ఈదుకుంటూ చాల హ్యాపీ గ ఉండేవి . ఈ మూడు చాపలలో మైత్రిమీనా బాగా తెలివైన చేప ముందుగా రాబోవు ఆపదను పసికట్టి జాగ్రత్త పడతది.
మూడు చేపల కథ - Three fishes story in Telugu |
జ్ఞానమీన సమయానికి తగినట్లు గా ఆపద వచ్చినపుడు మాత్రమే ఆలోచిస్తుంది . ఇక సోమరీన ఆలోచన లేకుండా ఏది జరిగితే అది అని సోమరితనం గా ఉంటది.
ఒకరోజు మైత్రిమీన తన మిత్రులతో ఈ ఇయర్ ఎండలు బాగా ఎక్కువగా వున్నవి చేరువులో నీళ్లు అన్ని ఇంకిపోతే జాలరులు వలలో పడతాము అని ముందుగానే అలోచించి చెపింది. కానీ ఆలోచన లేని జ్ఞానమీన మరియు సోమరీన మైత్రిమీన మాటలకూ నవ్వు కున్నాయి . మైత్రిమీన మాత్రం తన ఆలోచన సరిఅయినది అని భావించి ఇంకా పెద్ద సరస్సు లో కి వెళ్లి పోయింది .
మైత్రిమీన ఆలోచినట్లు చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి ఈలోపు జాలరులు వచ్చి వలవేసి చేపలను పట్టుకొన్నారు . ఆ వలలో జ్ఞానమీన మరియు సోమరీన చేపలు కూడా వున్నాయి . జ్ఞానమీన తన తెలివైన ఆలోచనతో సమయానికి తగినట్లు గా కదల కుండా పడివుంది జాలరులు జ్ఞానమీన చేపను చనిపోయింది అని భావించి సరస్సు వొడ్డున పడేసి వెళ్లి పోయారు జ్ఞానమీన బతుకు జీవుడా అంటూ మెల్లగా సరస్సు లోకి జారుకుని పారిపోయింది . సోమరీన మాత్రం ఆ ఆలోచన లేకపోవటం తో జాలరులు చేతిలో కూర అయింది .
నీతి : మన తెలివి తో ముందు గా రాబోయే ప్రమాదం ను కనుక్కొని బయటపడాలి . లేదా సమయానికి తగినట్టు గా ఆలోచించి ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి . లేదంటే సోమారిన లాగా ప్రమాదానికి బలి కాక తప్పదు.
కష్టం వచ్చినప్పుడు మన తెలివి తేటలే మన ఆయుధం . మరవకు మిత్రమా .....
0 Comments